Netikesari.com | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

సిద్దిపేట జిల్లాలో విషాదం

సిద్దిపేట జిల్లాలో విషాదం

మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

సిద్దిపేట నేటి కేసరి ఫిబ్రవరి 22

సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని సురభి మెడికల్ కాలేజ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీజ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.మృతురాలు పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందినదని సమాచారం. హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో సహ విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను మృతిగా ప్రకటించారు.సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి,వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, చదువుల ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత కారణాల కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనతో కాలేజీ ప్రాంగణంలో విషాద వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Socal Share

Related posts

షటిల్ కిట్టు ప్రథమ ద్వితీయ బహుమతులను బహుకరించిన చల్ల రాజేష్…!

Netikesari.com

ఆరిఫా రోషిని రీమా వృద్ధాశ్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…!

Netikesari.com

అన్నమయ్య జిల్లా విద్యా  శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు.శివ ప్రకాష్ రెడ్డి.

Netikesari.com

Leave a Comment