Netikesari.com | Telugu News Channel News App
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

థైరాయిడ్ హార్మోన్ల సమస్యల పై ఉచిత వైద్య శిబిరం

థైరాయిడ్ హార్మోన్ల సమస్యల పై ఉచిత వైద్య శిబిరం

నిరుపేదలు వైద్య చికిత్సకు ఇబ్బంది పడితే నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది

వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట నేటి కేసరి ఫిబ్రవరి 21

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో శ్రీ మోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్ల సమస్యలపై ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగ రాజేశ్వర్ రెడ్డి హాజరై వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ సంగు పురేందర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి తనకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. నీటి సమస్యను కూడా సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని పేర్కొంటూ, గ్రామస్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరైనా నిరుపేదలు వైద్య చికిత్సకు ఇబ్బంది పడితే తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

Socal Share

Related posts

సిఎం సహాయ నిది చెక్కులు పంపిణీ కార్యక్రమం

Thotapally Ravi

తెలంగాణ పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరామర్శ…

Netikesari.com

రైతులు పండించిన ధాన్యాన్ని… అమ్ముకోలేని దౌర్భాగ్య

Uppu Venkatesh

Leave a Comment