Netikesari.com | Telugu News Channel News App
తెలంగాణరాజకీయం

సిద్దిపేటలో హరీష్ రావు పతనం స్టార్ట్ అయ్యింది

సిద్దిపేటలో హరీష్ రావు పతనం స్టార్ట్ అయ్యింది

సిద్దిపేట నియోజిక కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ

సిద్దిపేట వెబ్ డెస్క్ నేటి కేసరి 30

సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి మహేష్ గౌడ్ ఆధ్వర్యం లొ కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరుకలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఖాళీ అవడం ఖాయం సిద్దిపేట నియోజిక కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామం నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంబటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా బి.ఆర్ ఎస్ కార్యకర్తలు,యువత, గ్రామ పెద్దలు ఆదివారం రోజు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.వీరికి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం లొ సిద్దిపేట నియోజిక ఇంచార్జి పూజల హరికృష్ణ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ సిద్దిపేట హరీష్ రావు పతనం స్టార్ట్ అయ్యిందని ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో సిద్దిపేట లొ బి ఆర్ ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. అలాగే తడ్కపల్లి గ్రామానికి పదేళ్లపాటు అధికారం లొ ఉన్న హరీష్ రావు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు ఆగ్రహం తో ఉన్నారన్నారు.గ్రామపాలక వ్యవస్థ, రోడ్లు, డ్రైనేజీలు, పబ్లిక్ సౌకర్యాలన్నీ పడి పోయినా,హరీష్ రావు చూపు తడ్కపల్లి గ్రామంపైన పడలేదని ప్రజలు స్పష్టం చేశారు.కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం ఉంచి,గ్రామ అభివృద్ధి కోసం ముందుకు రావాలనే సంకల్పంతో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అంబటి మహేష్ గౌడ్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం తో హరీష్ రావు కి భయం సోచ్చుకుందని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువడం ఖాయం అని అన్నారు.హరీష్ రావు పదేళ్లు అధికారం లో ఉండి తడ్కపల్లి గ్రామానికి ఏమి చేశారో ఒక్క పని చూపండి అని అన్నారు. తడ్కపల్లి గ్రామ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లొ రాగానే 110 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని 395 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అంబటి మహేష్ గౌడ్ ను గెలిపించాలని గ్రామాన్ని అన్ని విధాలా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామానికి ఎక్కువ నిధులు మంజూరు చేయించి గ్రామ అభివృద్ధి కోసం చేస్తానని తెలిపారు,నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారన్నారు,ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ లొ చేరిన అంబటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ హరీష్ రావు 12 సంవత్సరాలు నన్ను వాడుకొని ఎలాంటి పదవులు ఇవ్వకుండా మోసం చేశారాన్నారు,కాంగ్రెస్ రేవంత రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి సిద్దిపేట నియోజిక ఇంచార్జి హరికృష్ణ నాయకత్వం లొ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లొ అర్బన్ మండల అధ్యక్షులు కొలిమి బిక్షపతి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి,దాస అంజన్న, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి,కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పర్శ రాములు,కాంగ్రెస్ నాయకులు కొత్త మహిపాల్ రెడ్డి,ఎర్ర మహేందర్,చెంది శ్రీనివాస్ ముదిరాజ్, వంశీ,ఎల్లు శ్రీనివాస్ రెడ్డి,ఎర్రోని నర్సింలు,నవీన్ ముదిరాజ్, దుబ్బాక రాజు,దాకి కర్ణాకర్,శిమ్ముల శంకర్ రెడ్డి, కానుకరాజు,రజని సన తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

రైతులు పండించిన ధాన్యాన్ని… అమ్ముకోలేని దౌర్భాగ్య

Uppu Venkatesh

సిఎం సహాయ నిది చెక్కులు పంపిణీ కార్యక్రమం

Thotapally Ravi

తెలంగాణ పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరామర్శ…

Netikesari.com

Leave a Comment