క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట నేటి కేసరి 25
పర్వదినం సందర్బంగా సిద్దిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.ప్రతి ఏడాది ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పాల్గొంటునాను.ఈ పవిత్ర మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్ లు ఈ పండగ జరుపుకుంటున్నారు.ఏసు ప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారు.ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను, క్షమాగుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని,అందరూ సంతోషంగా ఉండాలి.కెసిఆర్ గత ప్రభుత్వంలో క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు.కెసిఆర్ అన్ని మతాలను గౌరవించారు.క్రిస్మస్ కిట్టు,బతుకమ్మ చీరెలు,రంజన్ తోపా ను కెసిఆర్ అందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ కిట్టు అందించడం లేదు.

