ప్రేమ–సేవ–ఐక్యతకు ప్రతీకగా క్రిస్మస్ వేడుకలు
సి ఎస్ ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణ
సిద్దిపేట నేటి కేసరి 25
యేసు క్రీస్తు బోధనలు సమాజానికి దారి చూపే దీపం గురువారం రోజు సిద్ధిపేట పట్టణంలోని సి ఎస్ ఐ చర్చిలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తూ,మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు తెలియజేయాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజాల హరికృష్ణ భరోసా ఇచ్చారు.అలాగే,యేసు క్రీస్తు బోధించిన ప్రేమ,క్షమ, సేవ భావనలు ప్రతి మనిషి జీవితంలో ఆచరణలోకి వస్తే సమాజం శాంతి మార్గంలో నడుస్తుందని అన్నారు.ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందాలంటే ప్రజలందరిలో సేవ దృక్పథం తప్పనిసరిగా ఉండాలని హితవు పలికారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తూ, ప్రతి వర్గానికి గౌరవం ఇచ్చే పాలన అందిస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగ అన్ని వర్గాల ప్రజలను ఒక్కటిగా చేసే మహత్తర పండుగ అని, ఇలాంటి వేడుకలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, క్రైస్తవ సోదర సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి,దాస అంజన్న,పూజల గోపిక్రిష్ణ,బిక్షపతి, రాజ బహదూర్ రెడ్డి,కొత్త మహిపాల్ రెడ్డి,ఎర్ర మహేందర్, టీఎంపీస్ జిల్లా అధ్యక్షులు చెంది శ్రీనివాస్ ముదిరాజ్, కేమ్మసారం రాజేష్ ఖన్నా,మేరుగు రాజు,ఏరాబోలు రాజిరెడ్డి, వెంకటేశ్వరా ఆలయ కమిటీ సభ్యురాలు ఉప్పెరెట్ల సంతోష, నుసి ప్రెసిడెంట్ అజమాత్, జనార్దన్ రెడ్డి,చోట అజమాత, ప్రవీణ్ మల్లేశం,రాజిరెడ్డి,కీర్తి శ్రీనివాస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.



