ఐడీఓసీ సమావేశ మందిరంలో పలు అధికారులతో సమీక్ష సమావేశం
జిల్లా కలెక్టర్ కె.హైమావతి / జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
నేటి కేసరి వెబ్ డెస్క్ సిద్ధిపేట నవంబర్ 24
సోమవారం ఉదయం ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని. కొనుగోలు కేంద్రాలకు చేరుతున్న ధాన్యం తడవకుండా ఉండేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా లేదో ప్రత్యేకంగా పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.జిల్లాలో అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉన్నందున, ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ వెల్లడించారు. అంగన్వాడీ, గ్రామపంచాయితీ భవనాల నిర్మాణాల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలకు మెరుగైన సేవలుఅందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంబి గా జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు.



