గన్నవరం పట్టణానికి చెందిన యువకుడు జె.సుభాష్ హీరో గా నటించిన చిత్రం కాస్ట్ లీ కోరికలు చిత్ర ట్రైలర్ ను ఆదివారం మధ్యాహ్నం చిత్ర బృందం విడుదల చేశారు. ఎస్.వి.వి. సాయి కుమార్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.వి.ఝాన్సి లక్ష్మి నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ ప్రేక్షకులకి అంచనాలు పెరిగేలా చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది.సందీప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

