షటిల్ కిట్టు ప్రథమ ద్వితీయ బహుమతులను బహుకరించిన చల్ల రాజేష్…!
మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు.
నేటి కేసరి పినపాక వెబ్ డెస్క్ నవంబర్ 23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, కళ్యాణపురం గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చల్ల రాజేష్ షటిల్ కిట్టు అందజేశారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో విజేతలకు ప్రధమ, ద్వితీయ బహుమతులను ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలకు గురికాకుండా మద్యపానం, ధూమపానం, గంజాయి వంటి చెడు అలవాట్లు నుండి కాపాడేందుకు కే ఈ క్రీడలని, తెలియజేశారు.క్రీడలు దేహదారుడ్యానికి, శారీరకంగా బలంగా ఉండడానికి, ఉపయోగపడతాయని, ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో… బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ బానోతు నాగేష్, మేకల రాజేష్, ఎన్నా సుధీర్, కాకర్ల ప్రదీప్, మేకల సాగర్, ఉయ్యల నవీన్, ఎడవలసిద్దు, అన్నపురెడ్డి జోయల్, పిట్ట చంటి, వంశీ, శరత్, అశోక్, భార్గవ్,నితీష్ పవన్,కళ్యాణ్ పాల్గొన్నారు.

