చిట్టాపూర్ గ్రామంలోనీ పెద్ద చెరువులో చేపల విడుదల కార్యక్రమం
సిద్ధిపేట నేటి కేసరి 22
దుబ్బాక మండలం లోని చిట్టాపూర్ గ్రామంలోనీ పెద్ద చెరువులో చేపల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూ గర్భశాస్త్ర శాఖ జీ.వివేక్ వెంకట స్వామి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ మా ప్రభుత్వం ఫిష్ ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యడానికి మత్స్య అభివృద్ధి మరియు స్టేట్ సెక్టార్ పథకం ద్వారా కృషి చేస్తుందని అన్నారు.100 శాతంరాయితీ పైన చిట్టాపూర్ పెద్ద చెరువులో 2 లక్షల 20వేల పలు రకాల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.మల్లన్న సాగర్ వద్ద 53 ఎకరాల ఫిష్ పాండ్ పెట్టేలాగా మత్స్య శాఖ శాఖ మంత్రితో మాట్లాడి తప్పకుండా సాంక్షన్ చేపిస్తానని హామీ ఇచ్చారు.


