Netikesari.com | Telugu News Channel News App
తెలంగాణవ్యవసాయం

రైతులు పండించిన ధాన్యాన్ని… అమ్ముకోలేని దౌర్భాగ్య

రైతులు పండించిన ధాన్యాన్ని… అమ్ముకోలేని దౌర్భాగ్య పరిస్థితి…

రైతే రాజు అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు

ధాన్యం దిగుమతులు కొనసాగించాలని నేషనల్ హైవే 365 పై ధర్నా నిర్వహించిన అన్నదాతలు

రైతుల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
.
ఖానాపురం ఎస్సై సిహెచ్ రఘుపతి ఆధ్వర్యంలో సర్దుబాటు

నేటి కేసరి నర్సంపేట వెబ్ డెస్క్ మే 27:

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రంలో శ్రీనివాస బాయిల్డ్ రైస్ మిల్ ముందు రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడంతో రైతులు ఆగ్రహానికి గురై శ్రీనివాస బాయిల్డ్ మిల్లు ముందు నేషనల్ హైవే 365 రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో రైతుల ధాన్యం తడిసి ముద్దవ్వడంతో బస్తాలలో ఉన్న ధాన్యాన్ని కింద పోసి మళ్ళీ ఆరబెట్టి మిల్లుకు చేరిస్తే మిల్లర్లు పట్టించుకోని పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతుల ధర్నాకు మద్దతు తెలుపుతూ ఖా నాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మరియు బీ ఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ధాన్యం దిగుమతులు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా అలసత్వం వహించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రైతులు పండించిన ధాన్యం కటింగ్ పై ఉన్న శ్రద్ధ దిగుమతుల విషయంలో ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. ధాన్యం దిగుమతుల విషయంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిల్ అయ్యారు అని అన్నారు. రైతుల అరిగోస పడుతుంటే స్థానిక అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని, కనీసం మండలంలో ఉన్న గోదాములు ఇప్పించలేని చేతగానితనంలో ఉన్నారని ఎద్దేవ చేశారు. మిల్లర్ల వద్ద ధాన్యాన్ని కటింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా అధికారులదే అని తెలిపారు. ఖానాపురం ఎస్సై వద్దకు వచ్చి రైతుల ధర్నాకు మద్దతు తెలిపి వారిని శాంతింప చేయడం తో పాటు మిల్లర్స్ తో మరియు సివిల్ సప్లై ఆఫీసర్ల తో మాట్లాడి రైతుల దిగుమతులను తొందరగా దిగుమతులు అయ్యేటట్లు చేసి రైతుల మన్ననలు పొందారు.

Socal Share

Related posts

చిట్టాపూర్ గ్రామంలోనీ పెద్ద చెరువులో చేపల విడుదల కార్యక్రమం

Thotapally Ravi

సిద్దిపేటలో హరీష్ రావు పతనం స్టార్ట్ అయ్యింది

Netikesari.com

ఐడీఓసీ సమావేశ మందిరంలో పలు అధికారులతో సమీక్ష సమావేశం

Thotapally Ravi

Leave a Comment