Netikesari.com | Telugu News Channel News App
తెలంగాణవిద్య/ఉద్యోగాలు

నిరుద్యోగ యువత ను మోసం చేయటం సింగరేణి యాజమాన్యంకు తగదు

నిరుద్యోగ యువత ను మోసం చేయటం సింగరేణి యాజమాన్యంకు తగదు

నిరుద్యోగ ఉపాధి మాటలకే పరిమిత మా …?

అధికారులు స్థానిక యువతకి స్పష్టమైన ప్రకటన చేయాలి

మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ

నేటి కేసరి మణుగూరు నవంబర్ 20

మణుగూరు ఏరియాలోని ఈనెల 19న మెగా జాబు మేళ అంటూ సింగరేణి కాలరీస్ యాజమాన్యం నిరుద్యోగ యువతీ యువకులను తప్పుదారి పట్టిస్తూ జాబ్ మేళా పేరుతో మోసం చేస్తోందని మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, నిరుద్యోగ యువత కోసం నవంబర్ 9న స్థానిక ఎమ్మెల్యే ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో “మెగా జాబ్ మేళా” పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించిన అధికారులు, మరుసటి రోజే విలేకరుల సమావేశం పెట్టి మరోసారి పెద్ద ఎత్తున పోస్టర్లు విడుదల చేశారని. నవంబర్ 19వ తేదీన పినపాక ప్రాంతంలోని ఏజెన్సీ ఏరియా యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. దీంతో తమకు ఉపాధి లభిస్తుందని, ఉపాధి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న యువత సుదూర ప్రాంతాల నుండి మణుగూరు వచ్చిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా కోసం ఆశగా ఎదురుచూసిన సింగరేణి అధికారులు ఏ కారణం చెపకుండానే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రచార ఆర్భాటాలతో పోస్టర్లతో ప్రచార కార్యక్రమం చేపట్టిన అధికారులు జాబ్ మేళా రద్దుకు ఏకారణం చెప్పకుండా ఎలా రద్దు చేశారని ఆమె నిలదీశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిలిచిపోయినా, ఏ ఒక్క మీడియా సంస్థ కూడా “ఎందుకు వాయి దా?” అనే ప్రశ్న అడగలేని పరిస్థితి నెలకొ నడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అధికారుల ఇచ్చే “”చాయ్–బిస్కెట్ల” కోసం వాస్తవాలు పక్కన పెట్టి రాయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనే బాధ్యత మీడియాపైన ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. నిజాలను నిర్భయంగా ధైర్యంగా వెలుగులోకి తేవాలని, అంతేకానీ సింగరేణి అధికారులకు వత్తాసు పలుకుతూ కొమ్ము కాయటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులు నిరుద్యోగ యువత కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా స్థానిక సింగరేణి జీయం, ఎమ్మెల్యే స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం కృషి చేయాలని, జాబ్ మేళా సంగతి ఎలా ఉంచితే, స్థానిక ఓబీ కంపెనీ, ఎస్ఎంఎస్ ప్లాంట్, ఏషియ న్ పెయింట్ బెల్ట్, సివిల్ వర్క్స్ టెండర్స్, కొత్తగా వచ్చే ఎస్ ఎన్ పి సి, గెస్ట్ హౌస్ టెండర్లలో ఉపాధి కల్పించడం వారికి మీరిచ్చే బహుమతిగా నిరుద్యోగులు భావిస్తారు అన్నారు.

Socal Share

Related posts

సిఎం సహాయ నిది చెక్కులు పంపిణీ కార్యక్రమం

Thotapally Ravi

సిద్దిపేటలో హరీష్ రావు పతనం స్టార్ట్ అయ్యింది

Netikesari.com

విపత్తు ప్రణాళిక హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన

Goddugorla Nagaraju

Leave a Comment