శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారిగా యు.శివ ప్రకాష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.గూడూరు ఉప విద్యాశాఖ అధికారిగా పని చేస్తున్న ఆయనను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారిగా పోస్టింగ్స్ ఇస్తూ బదిలీ చేయగా శనివారం ఆయన రాయచోటి లోని జిల్లా విద్యా శాఖ ప్రధాన కార్యాలయంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.
జానం న్యూస్, రాయచోటి ఫిబ్రవరి 10: శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారిగా యు.శివ ప్రకాష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.గూడూరు ఉప విద్యాశాఖ అధికారిగా పని చేస్తున్న ఆయనను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారిగా పోస్టింగ్స్ ఇస్తూ బదిలీ చేయగా శనివారం ఆయన రాయచోటి లోని జిల్లా విద్యా శాఖ ప్రధాన కార్యాలయంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘం నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివప్రకాష్ రెడ్డిని కలిసి పూల గుత్తి ఇచ్చి, దుస్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా నూతన విద్యాధికారి యు.శివ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్య సమస్యలు తీర్చుటకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందుకు సిబ్బంది, సంఘ నాయకులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నూతన జిల్లా విద్యాశాఖ అధికారి ని కలిసి, శుభాకాంక్షలు తెలిపినవారు అన్నమయ్య జిల్లా విద్యా శాఖ కార్యాలయం సిబ్బంది ఏడి ప్రసాద్ బాబు, సీనియర్ సహాయకులు సుదర్శన, బి.ప్రమీల, జూనియర్ సహాయకులు రాఘవ,సర్వ శిక్ష అభియాన్ సెక్టోరియల్ అధికారులు రాధ, జనార్ధన్, చంద్రశేఖర్, బాలాజీ నాయక్, సుధాకర్, షమిఉల్లా, రామకృష్ణ, మధుసూదన్, డి.సి.ఈ.ఓ రియాజ్, డీఈవో క్యాంపు క్లర్క్ హాబీబ్ బాషా,బాలాజీ,నాగేంద్ర,రవీంద్ర, ఎస్.టి.యు జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూధన, ఆర్థిక కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు జి.జగన్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కడియాల మురళి, మైనారిటీ నాయకులు మున్వర్ బాషా, రాయచోటి రీజినల్ కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి, పి.ఆర్.టి.యు రాయచోటి అధ్యక్షులు ఎన్.శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు పణింద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, సంబేపల్లి నాయకులు మార్ల ఓబుల్ రెడ్డి, ఆర్.వి రాజు, రాజేంద్ర తదితరులు ఉన్నారు.




